HomeWarangal Newsకాకతీయ వైద్య కళాశాలలో ఘనంగా ‘మెగా ప్లాంటేషన్ వన మహోత్సవం’

కాకతీయ వైద్య కళాశాలలో ఘనంగా ‘మెగా ప్లాంటేషన్ వన మహోత్సవం’

Published on

spot_img

వరంగల్: కాకతీయ వైద్య కళాశాల (KMC) ప్రాంగణంలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో, కళాశాల యాజమాన్య సహకారంతో ‘మెగా ప్లాంటేషన్ వన మహోత్సవం’ మంగళవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో వెయ్యికి పైగా మొక్కలను నాటారు.

​పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డా. కస్తూరి శ్రీధర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, కేఎంసీ ప్రిన్సిపాల్ డా. మోహన్ దాస్, పలువురు అటవీ శాఖ అధికారులు, సీనియర్ వైద్యులు మరియు వైద్య విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

​ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకోవాలి: ఎమ్మెల్యే నాయిని

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉద్ఘాటించారు. “వృక్షో రక్షతి రక్షితః” అనే సూక్తిని గుర్తుచేస్తూ, మొక్కలను నాటడం ఒక్కరోజుతో ముగిసేది కాదని, అది నిరంతర బాధ్యత అని పేర్కొన్నారు.

​వైద్య విద్యార్థులు ఐదేళ్ల పాటు కళాశాలలో చదువుకునే సమయంలో, ఒక్కొక్కరు కనీసం ఒక మొక్కను దత్తత తీసుకుని దానికి క్రమం తప్పకుండా నీరు పోస్తూ సంరక్షించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని వెళ్లే సమయానికి ఆ మొక్కలు కూడా పెరిగి పెద్దవవ్వాలని ఆకాంక్షించారు. ఆరోగ్యకరమైన వాతావరణం అనేక వ్యాధులను నివారిస్తుందని, ఉచితంగా మొక్కలను అందించిన అటవీ శాఖ అధికారులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

ALSO READ: KNRHUS వీసీగా రమేష్ రెడ్డి

​నగరానికి ‘గ్రీన్ లంగ్ స్పేస్’ కాకతీయ మెడికల్ కాలేజ్: కలెక్టర్

​హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ.. కాకతీయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో నగరంలో బహిరంగ ప్రదేశాలు తగ్గిపోయే అవకాశం ఉన్నందున, ఈ కళాశాల ప్రాంగణం నగరానికి కీలకమైన “గ్రీన్ లంగ్ స్పేస్”గా మారుతుందని చెప్పారు. నాటిన ప్రతీ మొక్కను కనీసం ఏడాది పాటు కాపాడుకుంటే దాని మనుగడ సాధ్యమవుతుందని, అందుకు అవసరమైన నీటి సౌకర్యాలను కల్పించేందుకు సంబంధిత శాఖలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

ALSO READ: వరంగల్ KMCకి జాతీయ స్థాయిలో 60వ ర్యాంకు

​పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డా. కస్తూరి శ్రీధర్ మాట్లాడుతూ.. కళాశాలతో ఉన్న అనుబంధంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, సహకరించిన అటవీ శాఖ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేలా చూస్తామని కళాశాల యాజమాన్యం మరియు విద్యార్థులు తెలిపారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles