HomeWarangal Newsకాకతీయ జూలాజికల్ పార్క్ సమగ్ర అభివృద్ధికి కేంద్ర నిధులు ఇవ్వాలి: కేంద్ర జూ అథారిటీకి వరంగల్...

కాకతీయ జూలాజికల్ పార్క్ సమగ్ర అభివృద్ధికి కేంద్ర నిధులు ఇవ్వాలి: కేంద్ర జూ అథారిటీకి వరంగల్ ఎంపీ వినతి

Published on

spot_img

హనుమకొండలోని కాకతీయ జూలాజికల్ పార్క్ అభివృద్ధికి కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (CAMPA) నిధులు మంజూరు చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర జూ అథారిటీ సభ్య కార్యదర్శి డా. వి. క్లెమెంట్ బెన్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.

​ఎన్‌క్లోజర్లు, నైట్ షెల్టర్లకు త్వరగా అనుమతులు:

జూలో సింహాలు, హైనా, జాకల్, వైల్డ్‌డాగ్, సరీసృపాల కోసం ప్రత్యేక ఎన్‌క్లోజర్లు, నైట్ షెల్టర్ల నిర్మాణానికి తెలంగాణ అటవీ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు ఎంపీ తెలిపారు. సాంకేతిక కమిటీ సూచనల మేరకు సవరించిన డిజైన్లు, డ్రాయింగ్‌లు కూడా సమర్పించినందున త్వరగా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.

​ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థ:

సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో మొక్కల పెంపకం, పచ్చదనం పెంచడంతో పాటు జంతువుల ప్రవర్తనను నిరంతరం గమనించేందుకు ఆధునిక వీడియో, ఆడియో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. జూను ఎకో టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దితే పర్యాటకరంగం పుంజుకుని, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

​ఎంపీ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన డా. వి. క్లెమెంట్ బెన్, నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు డా. కడియం కావ్య వెల్లడించారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles