HomeTourismవరంగల్‌లో తప్పక చూడాల్సిన 15 అద్భుతమైన ప్రదేశాలు – 2026 గైడ్

వరంగల్‌లో తప్పక చూడాల్సిన 15 అద్భుతమైన ప్రదేశాలు – 2026 గైడ్

Published on

spot_img

వరంగల్ దక్షిణ భారత రాష్ట్రమైన తెలంగాణలోని ఒక ప్రధాన నగరం మరియు ఇది 12 నుండి 14 వ శతాబ్దం వరకు కాకతీయ రాజవంశం యొక్క రాజధాని.

వరంగల్ నగరం తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండవ నగరం మరియు ఇది సందర్శించడానికి అనేక చారిత్రాత్మక మరియు భక్తి ప్రదేశాలను కలిగి ఉంది.

ముఖ్య సమాచారం

అంశంవివరాలు
ప్రదేశంవరంగల్, తెలంగాణ
సందర్శించడానికి ఉత్తమ సమయంఅక్టోబర్ – మార్చి
ప్రసిద్ధ ప్రదేశాలురామప్ప ఆలయం, వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ కోట
1 రోజు ట్రిప్భద్రకాళి ఆలయం, వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ ఫోర్ట్
2 రోజుల ట్రిప్రామప్ప ఆలయం, లక్నవరం, పాకాల సరస్సు
UNESCO Siteరామప్ప ఆలయం
కుటుంబ పర్యటనకులక్నవరం, భద్రకాళి చెరువు
చరిత్ర ప్రేమికులకువరంగల్ ఫోర్ట్, వెయ్యి స్తంభాల ఆలయం

వరంగల్‌లో సందర్శించాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు

ప్రదేశంరకంవరంగల్ నుంచి దూరంప్రత్యేకత
రామప్ప ఆలయంచారిత్రక ఆలయంసుమారు 70 కి.మీUNESCO World Heritage Site
వెయ్యి స్తంభాల ఆలయంఆలయంహనుమకొండకాకతీయ శిల్పకళ
భద్రకాళి ఆలయంఆలయంహనుమకొండప్రసిద్ధ దేవాలయం
వరంగల్ ఫోర్ట్చారిత్రక ప్రదేశంవరంగల్కాకతీయుల వారసత్వం
లక్నవరం సరస్సుప్రకృతిసుమారు 80 కి.మీసస్పెన్షన్ బ్రిడ్జ్
పాకాల సరస్సుప్రకృతిసుమారు 59 కి.మీసరస్సు + వన్యప్రాణులు
బొగత జలపాతంజలపాతంసుమారు 140 కి.మీప్రకృతి పర్యాటకం

వరంగల్‌కు ఇతర పేర్లు ఉన్నాయి:

హెరిటేజ్ సిటీ, గ్రేటర్ వరంగల్, ఓరుగల్లు మరియు ఎకాసిలా నాగరం.

ఖిల్లా వరంగల్ కోటలో నాలుగు అలంకార ద్వారాలు ఉన్నాయి, వీటిని కాకతీయ కళతోరణం అని పిలుస్తారు, మొదట శివాలయానికి ప్రవేశ ద్వారాలు ఏర్పడ్డాయి. అయితే ఇటీవల ప్రభుత్వ అధికారులు కళతోరణం నగర నలుమూలలా ప్రవేశ ద్వారాలన్నింటికి ఉంచాలని ప్రతిపాధించారు.

అధికారికంగా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ అధికారిక చిహ్నంలో పొందుపరచబడింది. ప్రస్తుత ప్రభుత్వం అందులో మార్పులు చేసారు.


గ్రేటర్ వరంగల్ చరిత్రలో కాకతీయులు మరియు కొండవీడు రెడ్డి రాజులు


వరంగల్ మరియు కాజిపేట మధ్యలో హన్మకొండ ఉంది, ఈ మూడు ప్రాంతాలను ట్రై సిటీస్ అని కూడా పిలుస్తుంటారు.

ఎందుకంటే ఈ మూడు నగరాలు బాగా అనుసంధానించబడి ఉన్నాయి మరియు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించడం సులభం.

దీనికి తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల నుండి వివిధ ప్రాంతాల ద్వారా రవాణా సౌకర్యం ఉంది.

వరంగల్ మరియు కాజిపేట్ రెండింటిలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఇవి వేర్వేరు నగరాలకు అనుసంధానించబడి ఉన్నాయి. కాజిపేట్ రైల్వే స్టేషన్ ఢిల్లీ, చెన్నై మరియు హైదరాబాద్ లకు రైల్వే జంక్షన్ హబ్ గా ఉంది.

advertise here

వరంగల్ లో సందర్శించడానికి చాలా చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి.

ఒక రోజు టూర్‌లో వెయ్యి స్తంభాల ఆలయం, భద్రకాళి ఆలయం, వరంగల్ ఫోర్ట్, కాకతీయ జూలాజికల్ పార్క్, మ్యూజికల్ గార్డెన్ వంటి ప్రదేశాలు చూడవచ్చు. రామప్ప టెంపుల్ (UNESCO వరల్డ్ హెరిటేజ్), పాకల్ సరస్సు, లఖ్నవరం లేక్ వంటివి 2-3 రోజుల టూర్‌కి ఐడియల్.

వరంగల్‌లో సందర్శించాల్సిన 10 ముఖ్యమైన ప్రదేశాలు ఏవి?

  1. రామప్ప ఆలయం
  2. వెయ్యి స్తంభాల ఆలయం
  3. భద్రకాళి ఆలయం
  4. వరంగల్ ఫోర్ట్
  5. లక్నవరం చెరువు
  6. పాకాల సరస్సు
  7. బొగత జలపాతం
  8. కాకతీయ జూలాజికల్ పార్క్
  9. పద్మాక్షి ఆలయం
  10. ఇస్కాన్ ఆలయం
  11. కాకతీయ మ్యూజికల్ గార్డెన్

వరంగల్‌లో ప్రసిద్ధ దేవాలయాలు

వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో చారిత్రక మరియు ప్రసిద్ధ దేవాలయాలు అనేకం ఉన్నాయి. భద్రకాళి ఆలయం, వెయ్యి స్తంభాల ఆలయం, పద్మాక్షి ఆలయం, రామప్ప ఆలయం వంటి ప్రముఖ ఆలయాల పూర్తి వివరాలను మా వరంగల్ దేవాలయాల గైడ్లో చూడవచ్చు.

భద్రకళి ఆలయం (Bhadrakali Temple)

వరంగల్‌లోనే ఉన్న ప్రసిద్ధ శక్తి పీఠం. భద్రకాళి అమ్మవారు దర్శనం చేసుకోవచ్చు.

ప్రదేశంటైమింగ్స్ఎంట్రీ ఫీజుఎక్స్ట్రా డీటెయిల్స్
భద్రకాళి ఆలయంఉదయం 5:30 – మధ్యాహ్నం 1:00 & సాయంత్రం 3:00 – రాత్రి 8:30ఉచితంఫెస్టివల్స్ టైమ్ లో ఎక్స్టెండ్ అవొచ్చు. ఇన్‌సైడ్ ఫోటోగ్రఫీ అల్లోవ్ కాదు.

భద్రకళి కట్ట

వెయ్యి స్తంభాల ఆలయం (1000 Pillars Temple)

హన్మకొండలో ఉన్న ఈ ఆలయం కాకతీయ ఆర్కిటెక్చర్‌కు మచ్చుతునక. శివ, విష్ణు, సూర్య దేవుడికి అంకితం. రాతి ఏనుగులు, పిల్లర్స్ చూడటం అద్భుతం.

| వెయ్యి స్తంభాల ఆలయం | ఉదయం 6:00 – రాత్రి 8:00 | ఉచితం | మార్నింగ్ దర్శనం బెస్ట్.|

ఫోర్ట్ వరంగల్ (Fort Warangal)

వరంగల్ కాకతీయ రాజవంశం యొక్క పురాతన రాజధాని

| వరంగల్ ఫోర్ట్ | ఉదయం 10:00 – సాయంత్రం 7:00 | ఇండియన్స్: ₹20-25 ఫారినర్స్: ₹250-300 | కీర్తి తోరణాలు మస్ట్-సీ. లైట్ & సౌండ్ షో ఈవెనింగ్స్ లో ఉంటుంది.|

కాకతీయ జూలాజికల్ పార్క్ (Kakatiya Zoological Park)

ఈ జూ 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది, మరియు వివిధ రకాల పక్షులు, జంతువులు మరియు సరీసృపాలు ఉన్నాయి.

| కాకతీయ జూలాజికల్ పార్క్ | ఉదయం 9:30 – సాయంత్రం 5:30 | ₹50 Adults -20 (Kids).|

ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం (Regional Science Centre)

సైన్స్, టెక్నాలజీ, గణితం మరియు ఇంజనీరింగ్ బోధించడానికి ప్రభావవంతమైన పద్ధతులను ఉపయోగించే విద్యా సౌకర్యం.

| ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం | ఉదయం 9:30 – సాయంత్రం 5:30 | ₹50 Adults -25 (Kids).|

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)

గతంలో రీజినల్ ఇంజనీరింగ్ కళాశాలగా పిలువబడే వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1959లో స్థాపించబడింది.

కాకతీయ మ్యూజికల్ గార్డెన్ (Kakatiya Musical Garden)

కాకతీయ మ్యూజికల్ గార్డెన్, తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లాలోని భద్రకాళి దేవాలయానికి సమీపంలో ఉన్న ఒక మ్యూజికల్ గార్డెన్.

| కాకతీయ మ్యూజికల్ గార్డెన్ | ఉదయం 9:00 – రాత్రి 8:00 | ₹10-20 (అప్రాక్స్) | మ్యూజికల్ ఫౌంటైన్ షో @ 7:45 PM—ఈవెనింగ్ బెస్ట్.|

కాకతీయ రాక్ గార్డెన్ (Kakatiya Rock Garden)

ఇది రాళ్ళతో అలంకరించబడిన అందమైన ప్రదేశం, ప్రకృతి ప్రేమికులకు, కుటుంబాలకు అనువైనది.

పద్మక్షి ఆలయం (Padmakshi Temple)

పద్మాక్షి అమ్మ గుట్ట (కొండ) పైన నివసిస్తుంది. ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ అన్నకొండ స్తంభం అని పిలువబడే అద్భుతమైన స్తంభం.

| పద్మక్షి ఆలయం | ఉదయం 6:00 – రాత్రి 8:00 | ఉచితం | మార్నింగ్ దర్శనం బెస్ట్.|

కాలా భైరవ ఆలయం (Kala Bhairava Temple)

కాలా భైరవ ఆలయం అంటే శివుని భయంకర రూపమైన కాల భైరవుడికి అంకితం చేయబడిన దేవాలయం

| కాలా భైరవ ఆలయం | ఉదయం 8:00 – సాయంత్రం 6:00 | ఉచితం | మార్నింగ్ దర్శనం బెస్ట్.|

గోవింద రాజుల గుట్ట (Govindarajula Gutta)

గోవిందరాజుల గుట్ట వరంగల్ జిల్లా లోని వరంగల్ రైల్వేస్టేషనుకు అతి సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం, పుణ్యక్షేత్రం.

కోటి లింగాల ఆలయం (Kotilingala Temple)

“కోటి లింగాల టెంపుల్” అనే ఆలయం ఉంది, ఇది భక్తులు తమ కోరికలు తీరాలని లింగాలను ప్రతిష్టించే ప్రదేశం

ఇస్కాన్ ఆలయం (Iscon Temple)

ఓరుగల్లు మోక్ష ధామం” అని కూడా పిలువబడే ఈ ఆలయం శ్రీ శ్రీ రాధా నిలమాధవకు అంకితం చేయబడింది.

హరి హర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయం (Hari Hara Khestram)

వరంగల్‌లో ఉన్న ముఖ్యమైన అయ్యప్ప దేవాలయాలలో ఒకటి హరి హర క్షేత్రం 

శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం (Mettu Ramalingeshwara Temple)

మడికొండలో ఉన్న శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం ఒక పురాతన శివాలయం, దీనిని “దక్షిణ కాశీ” అని కూడా పిలుస్తారు

శ్రీ సిద్దేశ్వర ఆలయం (Siddeshwara Temple)

ఒక పురాతన, ముఖ్యమైన శివాలయం, ఇది సిద్ధులగుట్ట దగ్గర ఉంది

యెర్రాగట్టు గుట్ట (Erragatu Gutta)

ఇది స్వయంభూ వెలసిన పురాతన ఆలయం, ఇక్కడ ఏటా వైభవంగా బ్రహ్మోత్సవాలు, జాతర జరుగుతాయి

శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ( Mallikarjun Swamy Templa, Inavol)

ఒక పురాతన శివాలయం, ఇది కాకతీయ రాజులచే 11వ శతాబ్దంలో నిర్మించబడింది, ముఖ్యంగా 108 స్తంభాలతో రథం ఆకారంలో ఉన్న అద్భుతమైన వాస్తుశిల్పం దీని ప్రత్యేకత.

బొగత జలపాతం (Bogatha Water Falls)

ఏడాది పొడవునా నీరు ప్రవహిస్తు ఉంటుంది. రోడ్డు సౌకర్యం లేదు, కాబట్టి సందర్శకులు జలపాతం చేరుకోవడానికి కొంత దూరం నడిచి వెళ్ళాలి. వరంగల్ నుంచి 140 కి.మీ.

| బొగత జలపాతం | ఉదయం 9:00 – సాయంత్రం 5:00 | ₹30 (అప్రాక్స్) |

పాకల్ సరస్సు ( Pakhal Lake)

పాకాల్ వైల్డ్‌లైఫ్ సాంక్చురీలో ఉన్న సీనిక్ లేక్. అడవులు, వైల్డ్‌లైఫ్ చూడొచ్చు. పీస్‌ఫుల్ స్పాట్. వరంగల్ నుంచి 59 కి.మీ.

| పాకల్ సరస్సు | ఉదయం 9:00 – సాయంత్రం 5:00 | Free |

లఖ్నవరం (Laknavaram Lake)

అడవుల మధ్యలో ఉన్న ఈ మన్‌మేడ్ లేక్‌లో సస్పెన్షన్ బ్రిడ్జ్, బోటింగ్ ఉంటాయి. పిక్నిక్, ఫోటోస్‌కు సూపర్. వరంగల్ నుంచి 80 కి.మీ.

| లఖ్నవరం | ఉదయం 9:00 – సాయంత్రం 5:00 |₹10 |

భీముని పాధం జలపాతం (Bheemmuni Padam Lake)

భీముని పాద జలపాతాలకు హైకింగ్ చేయడానికి ఉత్తమ ప్రదేశం. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు జలపాతం పూర్తి వేగంతో ప్రవహిస్తుంది. వరంగల్ నుంచి 55 కి.మీ.

రామప్ప ఆలయం (Ramappa Temple)

వరంగల్ నుంచి 70 కి.మీ. దూరంలో ఉన్న ఈ ఆలయం UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్ (2021 నుంచి). ఫ్లోటింగ్ బ్రిక్స్, ఇంట్రికేట్ స్కల్ప్చర్స్ – తప్పక చూడాలి!

| రామప్ప టెంపుల్ | ఉదయం 6:00 – సాయంత్రం 6:00 | ఉచితం | UNESCO సైట్; ఫుల్ డే ట్రిప్ ప్లాన్ చేయండి.

ఇవే కాకుండా నగరంలో మరియు నగర చుట్టుపక్కల అనేక చారిత్రాత్మిక మరియు భక్తి ప్రదేశాలు కూడా ఉన్నాయి.

వరంగల్ ఎందుకు ప్రత్యేకం?

వరంగల్ తెలంగాణలోని ప్రముఖ పర్యాటక నగరం. కాకతీయుల చారిత్రక వారసత్వం, UNESCO గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, ప్రసిద్ధ దేవాలయాలు, సరస్సులు, కోటలు మరియు ప్రకృతి అందాలతో దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.

ఒక రోజులో వరంగల్ ఎలా చూడాలి?

ఉదయం

✅ భద్రకాళి ఆలయం

✅ వెయ్యి స్తంభాల ఆలయం

మధ్యాహ్నం

✅ లంచ్

✅ కాకతీయ మ్యూజికల్ గార్డెన్

సాయంత్రం

✅ వరంగల్ ఫోర్ట్

✅ లైట్ & సౌండ్ షో

Greater Warangal సూచన

ఈ వ్యాసంలో పొందుపరిచిన టైమింగ్స్, ఎంట్రీ ఫీజులు మరియు ప్రయాణ సమాచారం 2026 నాటికి అందుబాటులో ఉన్న అధికారిక మరియు స్థానిక సమాచార ఆధారంగా సేకరించబడింది. ప్రయాణానికి ముందు సంబంధిత ప్రదేశాల అధికారిక సమాచారం ఒకసారి ధృవీకరించుకోవడం మంచిది.


రామోజీ ఫిల్మ్ సిటీ: ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా నగరం


For More Updates Follow us on
Instagram:
https://www.instagram.com/GreaterWarangalTv
Twitter:
https://x.com/GreaterWgl
Facebook:
https://www.facebook.com/GreaterWarangalNews/
YouTube: 
https://www.youtube.com/c/GreaterWarangaltv


వరంగల్ లో చూడాల్సిన ప్రముఖ ప్రదేశాల్లో
కాళోజీ కళాక్షేత్రం హనుమకొండ
కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

FAQ’s

1. వరంగల్‌లో 1 రోజులో ఏ ప్రదేశాలు చూడవచ్చు?

భద్రకాళి ఆలయం, వెయ్యి స్తంభాల ఆలయం మరియు వరంగల్ ఫోర్ట్ చూడవచ్చు.

2. వరంగల్‌లో అత్యంత ప్రసిద్ధ ప్రదేశం ఏది?

UNESCO గుర్తింపు పొందిన రామప్ప ఆలయం.

3. వరంగల్ వెళ్లడానికి ఉత్తమ సమయం ఏది?

అక్టోబర్ నుండి మార్చి వరకు.

4. లక్నవరం చెరువులో బోటింగ్ ఉందా?

అవును, బోటింగ్ మరియు హ్యాంగింగ్ బ్రిడ్జ్ అందుబాటులో ఉన్నాయి.

5. వరంగల్ ఫోర్ట్‌లో లైట్ & సౌండ్ షో ఉందా?

అవును, సాయంత్రం నిర్వహిస్తారు.

Latest articles

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను ఎంత దూరంలో పెట్టాలి? నిపుణుల సూచనలు !

నిద్రపోయే సమయంలో ఫోన్‌ను బెడ్‌కు దూరంగా పెట్టడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడటంతో పాటు స్క్రీన్ టైమ్ తగ్గుతుంది. ఫోన్‌ను దూరంగా ఉంచడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ముంబై ఎక్స్‌పోలో పాల్గొన్న జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న

ముంబైలో నిర్వహించిన అంతర్జాతీయ పర్యావరణ పరిజ్ఞాన ప్రదర్శన 'IFAT India 2026' సదస్సులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న పాల్గొన్నారు.

కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.
spot_img

Related Articles