HomeWarangal Institutionsకాకతీయ యూనివర్సిటీ ఫార్మా ఫ్యాకల్టీకి గ్లోబల్ ప్రశంసలు

కాకతీయ యూనివర్సిటీ ఫార్మా ఫ్యాకల్టీకి గ్లోబల్ ప్రశంసలు

Published on

spot_img

హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌ ఫ్యాకల్టీ అంతర్జాతీయ స్థాయిలో మరొకసారి ప్రతిష్టను చాటుకుంది.

ఫార్మసీ విభాగాన్ని భారతదేశంలోనే అగ్రశ్రేణి కాలేజీలలో ఒకటిగా గుర్తించడం తో పాటు, పరిశోధన రంగంలో ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించింది.

గ్లోబల్ రికగ్నిషన్‌కు కారణాలు

గత ఐదు దశాబ్దాల్లో యూనివర్సిటీ ఫార్మసీ విభాగం నుంచి వేలాది మంది బఫార్మసీ, ఎంఫార్మసీ, పీహెచ్‌డీ పట్టభద్రులు వెలువడి, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఔషధ పరిశ్రమ నిపుణులు, రెగ్యులేటరీ అధికారులుగా వెలుగొందుతున్నారు.

అమెరికా FDA మాజీ డైరెక్టర్ డాక్టర్ మన్సూర్ ఖాన్, దివిస్ ల్యాబొరేటరీస్ స్థాపకుడు డాక్టర్ డి.వి. మురళికృష్ణ, టెక్సాస్ A&M యూనివర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్ సాంబా రెడ్డి వంటి మాజీ విద్యార్థులు KU ఫార్మసీకి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చారు.

ఫార్మా ఫ్యాకల్టీ కీలక పాత్ర

ప్రొఫెసర్‌లు సి.కె.కొకటే, మల్లారెడ్డి, అమరేశ్వర్, రాంబాహు, డి.రామకృష్ణ, ఎం.సి.ప్రభాకర్ వంటి ప్రముఖులు ఫార్మసీ విద్య, పరిశోధనలో నూతన ప్రమాణాలు నెలకొల్పి KU ఫార్మసీకి గ్లోబల్ రికగ్నిషన్ తెచ్చినవారిగా గుర్తింపు పొందారు.

విభాగంలో గత 12 ఏళ్లలో 60కి పైగా పీహెచ్‌డీలు పూర్తవడం, అనేక పేటెంట్లు, నేషనల్–ఇంటర్నేషనల్ జర్నల్స్‌లో శాస్త్రీయ పత్రాలు ప్రచురించడంలో ఫ్యాకల్టీ కీలక పాత్ర పోషించింది.

విద్యార్థుల నైపుణ్యాలు

బీఫార్మసీ విద్యార్థులు NIPER వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించి, దేశంలోని ప్రముఖ ఫార్మసీ సంస్థల్లో అడ్మిషన్లు పొందుతున్నారు.

KU ఫార్మసీ విద్యార్థులు దేశీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్సుల్లో పేపర్ ప్రెజెంటేషన్లు, ఉత్తమ పోస్టర్ అవార్డులు సాధిస్తూ విభాగ ప్రతిష్ఠను మరింత పెంచుతున్నారు.

వీవీద ప్రసంశలు, భవిష్యత్ ప్రణాళికలు

కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్ రెడ్డి, ఫార్మసీ విభాగం గత యాభై ఏళ్ల ప్రయాణాన్ని స్మరించుకుంటూ, ఫ్యాకల్టీ, అల్యూమ్నీ తీసుకువచ్చిన అంతర్జాతీయ గుర్తింపు పట్ల ప్రశంసలు కురిపించారు.

అల్యూమ్నీ సపోర్టుతో ‘గోల్డెన్ జూబిలీ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’

ఇండియా–USA జాయింట్ రీసెర్చ్ గ్రాంట్

స్టూడెంట్–ఫ్యాకల్టీ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాములు ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

వరంగల్ కు గర్వంగా KU ఫార్మసీ

• తెలంగాణలో ఫార్మసీ రంగానికి KU ఫార్మసీ ఒక బలమైన దిగ్బంధంగా నిలిచి, రాష్ట్రాన్ని ఓ ప్రముఖ IT–Pharma హబ్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

హన్మకొండ–వరంగల్ ప్రజలకు KU ఫార్మసీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం గర్వకారణంగా మారి, ఇక్కడి విద్యార్థులకు గ్లోబల్ కెరీర్ అవకాశాలకు దారులు తెరిచింది.

Latest articles

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.
spot_img

Related Articles

తెలంగాణలో MBBS, BDS ఫీజులు (2026-29) ఇవే.. KNRUHS కీలక అప్‌డేట్..!

తెలంగాణలో MBBS, BDS ఫీజులు (2026-29) ఇవే.. KNRUHS కీలక అప్‌డేట్..!:తెలంగాణలో 2026-29 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ మెడికల్,...

NIT Warangalలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు.. అర్హతలు ఇవే..!

NIT Warangalలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రిషియన్ వంటి విభాగాల్లో అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

“జోసా” కౌన్సెలింగ్‌పై అవగాహన కోసం వరంగల్ ఎన్‌ఐటీ ‘ఓపెన్ హౌస్’..!

జోసా-2026 కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు, తల్లిదండ్రులకు మార్గదర్శనం కల్పించేందుకు వరంగల్ ఎన్‌ఐటీ ప్రత్యేక ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సీట్ల కేటాయింపు, ఎంపిక ప్రక్రియ, అడ్మిషన్ విధానాలపై నిపుణులు అవగాహన కల్పించనున్నారు.