కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 7, 10న జరగాల్సిన బీటెక్ మొదటి ఏడాది మొదటి సెమిస్టర్ పరీక్షలను మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో 16, 18 తేదీలకు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు.
ఫిబ్రవరి 10న జరగాల్సిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలను 18కి, 11న జరగాల్సిన పరీక్షలను 19కి మార్చారు. ఎంబీఏ పరీక్షలు కూడా 19కి వాయిదా పడ్డాయి. ఇతర పరీక్షలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.


