HomeWarangal Education Newsహన్మకొండలో స్పోర్ట్స్ స్కూల్ & ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం

హన్మకొండలో స్పోర్ట్స్ స్కూల్ & ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం

Published on

spot_img

స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు, క్రికెట్ స్టేడియం నిర్మాణం పై స్పోర్ట్స్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జెయేష్ రంజన్ మరియు వీసి&ఎండి స్పోర్ట్స్ అథారిటీ సోని బాలదేవి గార్లతో సమావేశం అయిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హన్మకొండ జిల్లాలో తాత్కాలిక ప్రాతిపదికన జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు.

జాతీయ రహదారి 163కి అనుకోని హన్మకొండ జిల్లా ఉనికిచర్ల గ్రామం వద్ద అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణం పై యూత్ అడ్వాన్స్ మెంట్, టూరిజం కల్చర్ అండ్ స్పోర్ట్స్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జెయేష్ రంజన్ మరియు వీసి &ఎండి స్పోర్ట్స్ అథారిటీ సోని బాలదేవి గార్లతో…

హైదరాబాద్ లోని సచివాలయం లో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ హన్మకొండ లోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో తాత్కాలిక ప్రాతిపదికన స్పోర్ట్స్ స్కూల్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు కు అవసరమైన అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు.

క్రీడాకారులకు ఇండోర్, అవుట్ డోర్ క్రీడా మైదానాలు, ట్రాక్స్, హాస్టల్ వసతికి అవసరమైన మారమ్మత్తులు కూడా పూర్తి చేసినట్లు వెల్లడించారు.

కావున ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభించేందుకు ప్రభుత్వ పరమైన అనుమతులు ఇవ్వాలని కోరారు.

అలాగే జాతీయ రహదారి 163కి అనుకోని హన్మకొండ జిల్లా ఉనికిచర్ల గ్రామం వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అనువైన స్థలం అందుబాటులో ఉందని తెలిపారు.

హన్మకొండ జిల్లాలో క్రికెట్ స్టేడియం నిర్మాణం ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

దీనిపై సానుకూలంగా స్పందించిన జెయేష్ రంజన్ గారు జవహర్ లాల్ నెహ్రు స్టేడియంలో తాత్కాలిక ప్రాతిపదికన స్పోర్ట్స్ స్కూల్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు.

14 నవంబర్ 2025 లోపు ఏర్పాటు చేసేందుకు అనుమతులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

క్రికెట్ స్టేడియం నిర్మాణానికి హన్మకొండ జిల్లా కలెక్టర్ ను ఫీజుబులిటీ రిపోర్ట్ మరియు స్థల సేకరణ పై నివేదికను అందించాలని ఆదేశించినట్లు ఆ నివేదికలు రాగానే…

క్రికెట్ స్టేడియం నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Latest articles

ఐఫోన్‌లో కొత్త శకం.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

యాపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కొత్త డిజైన్, ఫోల్డింగ్ డిస్‌ప్లే, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఐఫోన్‌పై టెక్ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.
spot_img

Related Articles

కాకతీయ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్లు 2026 ప్రారంభం..పూర్తి వివరాలు..!

కాకతీయ యూనివర్సిటీ 2026 విద్యా సంవత్సరానికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సుల అడ్మిషన్లను ప్రారంభించింది. డిగ్రీ, పీజీతో పాటు పలు సర్టిఫికేట్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, కోర్సులు, దరఖాస్తు ప్రక్రియ, ముఖ్యమైన తేదీల వివరాలను తెలుసుకోండి.

వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణితశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత విద్యార్హతలతో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కళాశాల యాజమాన్యం సూచించింది.

TG CPGET 2026: ప్రిలిమినరీ కీ విడుదల చేసిన కాకతీయ యూనివర్సిటీ

కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన TG CPGET–2026 ప్రవేశ పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదలైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో కీని పరిశీలించి, జూలై 20 మధ్యాహ్నం 1:40 గంటలలోపు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు నమోదు చేసుకోవచ్చని కన్వీనర్ తెలిపారు.