HomeWarangal Newsకష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా ఎంపీ కడియం కావ్య.. ‘నేనున్నాను’ అంటూ భరోసా..!

కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా ఎంపీ కడియం కావ్య.. ‘నేనున్నాను’ అంటూ భరోసా..!

Published on

spot_img

కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా ఎంపీ కడియం కావ్య.. ‘నేనున్నాను’ అంటూ భరోసా :

ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలవడమే నిజమైన ప్రజాసేవ అని మరోసారి చాటిచెప్పారు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య. సమస్యల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు స్వయంగా ముందుకు వస్తున్నారు. ప్రజల బాధలను తెలుసుకోవడమే కాకుండా, వాటి పరిష్కారం కోసం చొరవ తీసుకుంటూ మానవతా దృక్పథంతో సేవలందిస్తున్న నాయకురాలిగా ఆమె గుర్తింపు పొందుతున్నారు. కష్టకాలంలో “మీకు నేను ఉన్నాను” అనే భరోసాను అందిస్తూ ఎన్నో కుటుంబాలకు ధైర్యం నింపుతున్నారు.

వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ప్రజల సమస్యలను సానుభూతితో స్వీకరిస్తూ అవసరమైన వారికి అండగా నిలుస్తున్నారు. ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతలను నిర్వర్తించడమే కాకుండా కష్టాల్లో ఉన్న కుటుంబాలకు భరోసానిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు.కాళోజి కళాక్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండకు వచ్చిన సందర్భంగా ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన తండ్రి భుజాలపై కూర్చొని, “నేను క్యాన్సర్‌తో బాధపడుతున్నాను… దయచేసి నన్ను ఆదుకోండి” అని రాసిన ఫ్లకార్డును ప్రదర్శిస్తున్న ఆరేళ్ల చిన్నారి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య దృష్టిని ఆకర్షించాడు. వెంటనే స్పందించిన ఆమె ఆ బాలుడి కుటుంబ సభ్యులను పిలిపించి, వారి పరిస్థితిని స్వయంగా తెలుసుకుని సమస్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.

చిన్నారి వైద్య చికిత్స కోసం కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తెలుసుకున్న ఎంపీ వెంటనే స్పందించారు. వైద్యులతో మాట్లాడి అవసరమైన చికిత్స అందేలా చర్యలు చేపట్టడంతో పాటు ఎల్ఓసి ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేశారు. గత రెండు సంవత్సరాలుగా ఆ చిన్నారి చికిత్సకు అవసరమైన సహకారం అందిస్తూ కుటుంబానికి అండగా నిలిచారు. అదేవిధంగా సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో నివసిస్తున్న ఆ కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని ఇందిరమ్మ గృహ పథకం కింద డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు అయ్యేలా కృషి చేశారు.

ఇదే కార్యక్రమంలో మరో నిరుపేద కుటుంబానికి కూడా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆశాకిరణంగా నిలిచారు. వృద్దురాలు మరియు ఆమె వికలాంగ కుమారుడు నివాస సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న డాక్టర్ కడియం కావ్య వారి పరిస్థితిని పరిశీలించి అవసరమైన సహాయం అందించారు. ఇందిరమ్మ గృహ పథకం కింద వారికి కూడా ఇల్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకొని లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.

వైద్యం, గృహం, విద్య, ఉపాధి వంటి అంశాల్లో అవసరమైన వారికి సహకారం అందిస్తూ డాక్టర్ కడియం కావ్య ప్రజలకు మరింత చేరువవుతున్నారు. ప్రజల సమస్యలను తమ కుటుంబ సమస్యలుగా భావించి స్పందించే నాయకత్వానికి ఆమె నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. అభివృద్ధితోపాటు మానవీయ విలువలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజాసేవకు కొత్త అర్ధాన్ని అందిస్తున్నారని స్థానికుల అభిప్రాయపడుతున్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను ఎంత దూరంలో పెట్టాలి? నిపుణుల సూచనలు !

నిద్రపోయే సమయంలో ఫోన్‌ను బెడ్‌కు దూరంగా పెట్టడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడటంతో పాటు స్క్రీన్ టైమ్ తగ్గుతుంది. ఫోన్‌ను దూరంగా ఉంచడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ముంబై ఎక్స్‌పోలో పాల్గొన్న జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న

ముంబైలో నిర్వహించిన అంతర్జాతీయ పర్యావరణ పరిజ్ఞాన ప్రదర్శన 'IFAT India 2026' సదస్సులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న పాల్గొన్నారు.

కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.
spot_img

Related Articles

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

వేయి స్తంభాల గుడిలో ‘ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి’ ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

హనుమకొండలోని చారిత్రాత్మక శ్రీ రుద్రేశ్వరస్వామి దేవాలయంలో ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ నవరాత్రి ఉత్సవాలు కొనసాగనున్నాయి.

NDA పరీక్ష ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఈ నెల 13న నిర్వహించనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షకు సంబంధించి పింగిలి కళాశాల పరీక్ష కేంద్రాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సందర్శించారు. కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.