HomeWarangal Education News📚 SSC Hall Tickets: ఇక వాట్సప్‌లోనే ‘పది’ హాల్‌టికెట్లు

📚 SSC Hall Tickets: ఇక వాట్సప్‌లోనే ‘పది’ హాల్‌టికెట్లు

Published on

spot_img

రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి (SSC) వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు ఇప్పుడు వాట్సప్‌ ద్వారా కూడా పొందే అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.

విద్యార్థులు ముందుగా 8096958096 అనే వాట్సప్‌ నంబర్‌కు “Hi” అని మెసేజ్‌ పంపాలి. వెంటనే Welcome to MeeSeva అనే మెసేజ్‌ వస్తుంది. అనంతరం “SSC Hall Ticket March-2026” అని పంపితే ఒక లింక్‌ అందుతుంది.

ఆ లింక్‌ను ఓపెన్‌ చేసి జిల్లా, మండలం, పాఠశాల పేరు ఎంపిక చేసి, విద్యార్థి పేరు మరియు పుట్టిన తేదీ నమోదు చేస్తే హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తరువాత దాన్ని ఇంటర్‌నెట్‌ సెంటర్‌ లేదా మీ సేవా కేంద్రంలో ప్రింట్‌ తీసుకోవచ్చు.

అలాగే ఈ నెల 5వ తేదీ నుంచి పాఠశాలల లాగిన్‌లో కూడా హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని, వాటిని హెడ్‌మాస్టర్లు లేదా ప్రిన్సిపాళ్ల ద్వారా కూడా పొందవచ్చని అధికారులు తెలిపారు.

ఇక ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కూడా విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈసారి హాల్‌టికెట్లపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రించారని, దాని ద్వారా విద్యార్థులు తమ ఇల్లు నుంచి పరీక్షా కేంద్రం వరకు దూరం, ప్రయాణ సమయం, చిరునామా వంటి వివరాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు.

హాల్‌టికెట్‌లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే పాఠశాల హెడ్‌మాస్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

Telangana Government Schemes 2026 – తెలంగాణ ప్రభుత్వ పథకాల పూర్తి వివరాలు తెలుసుకోండి

తెలంగాణ ప్రభుత్వ పథకాలు 2026 పూర్తి వివరాలు.

హనుమకొండ మోడల్ స్కూల్స్‌లో 12 ఉద్యోగాలు.. నవంబర్ 12 వరకు దరఖాస్తులకు అవకాశం!

హనుమకొండ జిల్లాలోని ముల్కనూర్, ఎల్కతుర్తి, కమలాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 12 ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 12లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సైనిక్ స్కూళ్ల ప్రవేశాలకు AISSEE-2027 నోటిఫికేషన్ విడుదల – 6, 9వ తరగతులకు దరఖాస్తులు ప్రారంభం

AISSEE-2027 ద్వారా దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు, అవసరమైన పత్రాలు, ఆన్‌లైన్ అప్లికేషన్ విధానం, అధికారిక లింకులు మరియు పూర్తి వివరాలు