HomeWarangal Education Newsస్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రవేశాల బ్రోచర్ ఆవిష్కరణ

స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రవేశాల బ్రోచర్ ఆవిష్కరణ

Published on

spot_img

హన్మకొండ | తేది: 19-03-2026

స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల బ్రోచర్‌ను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హన్మకొండ కనకదుర్గ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వ కళాశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఉచిత కంప్యూటర్ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు వంటి సదుపాయాలు విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడతాయని చెప్పారు.

అలాగే విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, టీఎస్కేసీ (TSKC) ద్వారా ఉద్యోగావకాశాలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, పోటీ పరీక్షల మార్గదర్శకత్వం వంటి అనేక సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బత్తిని చంద్రమౌళి, అధ్యాపకులు నాగరాజు, సుమలత, అఖిల తదితరులు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

Telangana Government Schemes 2026 – తెలంగాణ ప్రభుత్వ పథకాల పూర్తి వివరాలు తెలుసుకోండి

తెలంగాణ ప్రభుత్వ పథకాలు 2026 పూర్తి వివరాలు.

హనుమకొండ మోడల్ స్కూల్స్‌లో 12 ఉద్యోగాలు.. నవంబర్ 12 వరకు దరఖాస్తులకు అవకాశం!

హనుమకొండ జిల్లాలోని ముల్కనూర్, ఎల్కతుర్తి, కమలాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 12 ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 12లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సైనిక్ స్కూళ్ల ప్రవేశాలకు AISSEE-2027 నోటిఫికేషన్ విడుదల – 6, 9వ తరగతులకు దరఖాస్తులు ప్రారంభం

AISSEE-2027 ద్వారా దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు, అవసరమైన పత్రాలు, ఆన్‌లైన్ అప్లికేషన్ విధానం, అధికారిక లింకులు మరియు పూర్తి వివరాలు