HomeWarangal Education Newsతెలంగాణ CMOSS 2026: మైనారిటీ విదేశీ విద్యా స్కాలర్‌షిప్ దరఖాస్తులు ప్రారంభం, రూ.20 లక్షల సహాయం

తెలంగాణ CMOSS 2026: మైనారిటీ విదేశీ విద్యా స్కాలర్‌షిప్ దరఖాస్తులు ప్రారంభం, రూ.20 లక్షల సహాయం

spot_img

హైదరాబాద్: మైనారిటీ విద్యార్థులకు విదేశీ విద్యావకాశం తెలంగాణ CMOSS 2026.

ముఖ్యమంత్రి విదేశీ విద్యా స్కాలర్‌షిప్ పథకం – స్ప్రింగ్ 2026 సెషన్‌కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ వర్గాల విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించేందుకు Chief Minister’s Overseas Scholarship Scheme (CMOSS) – Spring 2026 సీజన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ముఖ్యమైన అర్హతలు:

  • దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించకూడదు
  • డిగ్రీ/గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి
  • GRE/GMATతో పాటు IELTS/TOEFL వంటి ప్రామాణిక పరీక్షల్లో నిర్దేశిత స్కోర్ తప్పనిసరి
  • ఒక కుటుంబం నుండి ఒక్క విద్యార్థి మాత్రమే ఈ పథకానికి అర్హులు

వర్తించే దేశాలు & కోర్సులు:

అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, న్యూజిలాండ్, సింగపూర్, దక్షిణ కొరియా తదితర దేశాల్లోని గుర్తింపు పొందిన యూనివర్సిటీలలో పీజీ లేదా పీహెచ్‌డీ కోర్సులకు అడ్మిషన్ పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

CMOSS Press Note

అందించే ప్రయోజనాలు:

ఎంపికైన అభ్యర్థులకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. దీంతో పాటు ఒకసారి వన్-వే ఎకానమీ క్లాస్ విమాన టికెట్ మరియు వీసా ఫీజును కూడా ప్రభుత్వమే భరిస్తుంది.

దరఖాస్తు వివరాలు:

అర్హులైన విద్యార్థులు తెలంగాణ ఈ-పాస్ అధికారిక వెబ్‌సైట్ https://telanganaepass.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 01 జూన్ 2026
  • చివరి తేదీ: 30 జూన్ 2026

అర్హత ఉన్న మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

Latest articles

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి
spot_img

Related Articles

కాకతీయ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్లు 2026 ప్రారంభం..పూర్తి వివరాలు..!

కాకతీయ యూనివర్సిటీ 2026 విద్యా సంవత్సరానికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సుల అడ్మిషన్లను ప్రారంభించింది. డిగ్రీ, పీజీతో పాటు పలు సర్టిఫికేట్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, కోర్సులు, దరఖాస్తు ప్రక్రియ, ముఖ్యమైన తేదీల వివరాలను తెలుసుకోండి.

వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణితశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత విద్యార్హతలతో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కళాశాల యాజమాన్యం సూచించింది.

TG CPGET 2026: ప్రిలిమినరీ కీ విడుదల చేసిన కాకతీయ యూనివర్సిటీ

కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన TG CPGET–2026 ప్రవేశ పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదలైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో కీని పరిశీలించి, జూలై 20 మధ్యాహ్నం 1:40 గంటలలోపు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు నమోదు చేసుకోవచ్చని కన్వీనర్ తెలిపారు.