HomeWarangal Education Newsతెలంగాణ గురుకుల ప్రవేశ ఫలితాలు విడుదల… ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ గురుకుల ప్రవేశ ఫలితాలు విడుదల… ఇలా చెక్ చేసుకోండి

Published on

spot_img

హైదరాబాద్: తెలంగాణలోని సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఐదో తరగతి సహా 6, 7, 8, 9వ తరగతుల రెగ్యులర్ మరియు బ్యాక్‌లాగ్ సీట్లకు సంబంధించిన ఫలితాలు ఇప్పుడు ఆన్లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.

విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్ లేదా మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, అలాగే స్క్రీన్‌పై కనిపించే వెరిఫికేషన్ కోడ్ నమోదు చేసి ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు.

ఫలితాలు చెక్ చేసే వెబ్‌సైట్లు:

https://tgcet.cgg.gov.in

https://treirb.telangana.gov.in

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ప్రవేశాల కోసం గత ఏడాది డిసెంబర్ 11 నుంచి జనవరి 25 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఫిబ్రవరి 22న తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGCET–2026) నిర్వహించారు. ఇప్పుడు ఆ పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లలో విడుదల చేశారు.

📌 గమనిక: ఎంపికైన విద్యార్థులు తదుపరి దశలైన సర్టిఫికేట్ వెరిఫికేషన్, అడ్మిషన్ ప్రక్రియలపై అధికారిక ప్రకటనలను తరచూ పరిశీలించాలని సూచించారు.

TG Gurukul CET-2026: 5వ-9వ తరగతి ప్రవేశాల నోటిఫికేషన్

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

Telangana Government Schemes 2026 – తెలంగాణ ప్రభుత్వ పథకాల పూర్తి వివరాలు తెలుసుకోండి

తెలంగాణ ప్రభుత్వ పథకాలు 2026 పూర్తి వివరాలు.

హనుమకొండ మోడల్ స్కూల్స్‌లో 12 ఉద్యోగాలు.. నవంబర్ 12 వరకు దరఖాస్తులకు అవకాశం!

హనుమకొండ జిల్లాలోని ముల్కనూర్, ఎల్కతుర్తి, కమలాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 12 ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 12లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సైనిక్ స్కూళ్ల ప్రవేశాలకు AISSEE-2027 నోటిఫికేషన్ విడుదల – 6, 9వ తరగతులకు దరఖాస్తులు ప్రారంభం

AISSEE-2027 ద్వారా దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు, అవసరమైన పత్రాలు, ఆన్‌లైన్ అప్లికేషన్ విధానం, అధికారిక లింకులు మరియు పూర్తి వివరాలు