తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత దృష్ట్యా ఈరోజు ‘రెడ్ అలర్ట్’ జారీ చేసే అవకాశం ఉంది.
ఇలాంటి మరిన్ని తెలంగాణ తాజా వార్తల కోసం Greater Warangal News ను సందర్శించండి.
ప్రజలు మధ్యాహ్నం సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


