రాష్ట్రంలో వాహనదారుల కోసం వాహన్ పోర్టల్ మొబైల్ నంబర్ అప్‌డేట్ తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే 30 రోజుల్లోగా వాహన్ పోర్టల్ మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయాలని సూచిస్తూ రవాణా శాఖ స్పష్టం చేసింది.
వాహన్ పోర్టల్ మొబైల్ నంబర్ అప్‌డేట్ అంటే వాహనదారులు తమ ప్రస్తుత మొబైల్, వాట్సాప్, ఈమెయిల్ వివరాలను వాహన్ వెబ్‌సైట్‌లో నమోదు చేయడం.
అప్‌డేట్ చేయకపోతే మీకే నష్టం:
నిర్ణీత నెల రోజుల గడువు ముగిసిన తర్వాత, వాహన్ (Vahan) పోర్టల్‌లో అప్పటికే నమోదై ఉన్న పాత వివరాలకే డిజిటల్ చలానాలు, ఎస్ఎంఎస్‌లు లేదా మెయిల్ ద్వారా సమాచారం పంపుతారు. ఒకవేళ నంబర్ పనిచేయకపోవడం వల్లనో లేదా ఇతర కారణాల వల్లనో మీకు సమాచారం చేరకపోయినా… నిబంధనల ప్రకారం ఆ చలానా నోటీసు వాహనదారునికి చేరినట్లుగానే అధికారులు భావిస్తారు.
ఈ నిబంధన వల్ల భవిష్యత్తులో అనవసరపు ఇబ్బందులు, పెనాల్టీలు పడకుండా ఉండాలంటే వెంటనే ‘వాహన్’, ‘సారథి’ వెబ్‌సైట్లలోకి వెళ్లి మీ తాజా కాంటాక్ట్ వివరాలను సరిచూసుకోవాలని రవాణా శాఖ స్పష్టం చేసింది.
FAQ’s
- వాహన్ పోర్టల్ మొబైల్ నంబర్ అప్‌డేట్ ఎలా చేయాలి?
వాహన్ లేదా సారథి వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ వాహన వివరాలు నమోదు చేసి మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయాలి.
- అప్‌డేట్ చేయకపోతే ఏమవుతుంది?
పాత నంబర్‌కే చలానాలు పంపబడతాయి. సమాచారం అందకపోయినా అది చెల్లుబాటు అవుతుంది.
- గడువు ఎంత?
30 రోజుల్లోగా అప్‌డేట్ చేయాలి.
Read Warangal News and Latest Politics News and Real Estate


