వరంగల్‌లోని ప్రతిష్ఠాత్మక ‘పీఎం మిత్ర’ మెగా టెక్స్టైల్ పార్క్ పనుల పురోగతిపై వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, ఉత్పత్తి ప్రారంభం మరియు ఉద్యోగాల కల్పన ఎంతవరకు వచ్చిందో వివరాలు వెల్లడించాలని లోక్‌సభలో కోరారు. ముఖ్యంగా స్థానిక యువతతో పాటు మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర బలహీన వర్గాలకు ఈ పార్క్ ద్వారా లభించే ఉపాధి అవకాశాలపై స్పష్టతనివ్వాలని ప్రశ్నించారు.
Related Article: వరంగల్ టెక్స్టైల్ పార్క్‌కు కేంద్రం పచ్చజెండాఎంపీ కడియం కావ్య ప్రశ్నకు కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా సమాధానమిస్తూ.. దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన ఏడు పీఎం మిత్ర పార్కులలో తెలంగాణలోని వరంగల్‌ను ఒక ప్రాంతంగా ఎంపిక చేశామని తెలిపారు. ఈ పార్క్‌ను ‘బ్రౌన్‌ఫీల్డ్’ కేటగిరీ కింద అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.
కేంద్రం ఇచ్చిన సమాధానంపై ఎంపీ కడియం కావ్య స్పందిస్తూ.. వరంగల్ పీఎం మిత్ర పార్క్ కేవలం ఒక పారిశ్రామిక ప్రాంతంగానే కాకుండా, తెలంగాణలోనే అతిపెద్ద ఉపాధి మరియు పెట్టుబడుల కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు. అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన వేగవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు.
ALSO READ: కాకతీయ టెక్స్టైల్ పార్క్‌లో 3,400 ఉద్యోగాలు..! వరంగల్ యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే నాణ్యమైన ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణ అందించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. వరంగల్‌ను జాతీయ స్థాయి జౌళి హబ్‌గా తీర్చిదిద్దేందుకు, కొత్త పెట్టుబడులు రప్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎంపీ తెలిపారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

