రామ్ చరణ్ బూమ్రా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. స్టార్ సెలబ్రెటీస్ మాట్లాడిన ప్రతి మాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన ఒక చిన్న పొరపాటు పెద్ద చర్చకు దారితీసింది.
రీసెంట్గా రాంచరణ్ నటించిన “పెద్ది” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా భూపాల్ లో “పెద్దికి ఆవాజ్” పేరుతో భారీ లైవ్ కన్సెర్ట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ పొరపాటున నోరు జారారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన ప్రత్యేక ఇంటరాక్షన్ సెషన్ లో హోస్ట్ అడిగిన ప్రశ్నలకు రాంచరణ్ సమాధానాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ల పేర్లు చెబుతూ వారి గురించి ఒక్క మాటలో స్పందించాలి అంటూ కోరారు.
రామ్ చరణ్ బూమ్రా వ్యాఖ్యలు వైరల్
సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్ల గురించి చరణ్ చాలా ఆసక్తికరంగా మాట్లాడారు.

అయితే టీమిండియా స్టార్ పెసర్ జస్ప్రీత్ బూమ్రా పేరు చెప్పిన సమయంలో రాంచరణ్ పొరపాటున “ఆయన మంచి ఫుట్బాల్ ప్లేయర్ అని అద్భుతంగా ఆడుతారు అని” చెప్పారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉండే వాళ్ళు షాక్ అయిపోయారు.
బూమ్రా ఫుట్బాల్ ప్లేయర్ ఏంటి..? అంటూ షాక్ అయిపోయారు.

వెంటనే స్పందించిన రామ్ చరణ్
ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో బాగా విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. దీంతో బూమ్రా ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు. అయితే ఈ వివాదం మరింత పెద్దదిగా మారకముందే రాంచరణ్ స్పందించారు.
ఆయన సోషల్ మీడియా ఖాతా ద్వారా బూమ్రా ని ట్యాగ్ చేస్తూ.. “మీ విజయాలు ప్రతి భారతీయుడికి గర్వకారణం.. మైదానంలో మీ ఆటకు నేను బిగ్ ఫ్యాన్ ని మీ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది” అంటూ రాసుకొచ్చారు.
దీంతో రామ్ చరణ్ నిజాయితీ మంచితనం ఇంకా హైలైట్ గా మారింది.
మనిషి అన్నాక కొన్ని కొన్ని సందర్భాలలో పొరపాట్లు చేయడం కామన్.. ఆ పొరపాటున సరిదిద్దుకోవడమే రియల్ హీరోయిజం అందులో రామ్ చరణ్ నెంబర్ వన్ అంటూ మెగా ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు..!!
Read Warangal News and Latest Politics News and Real Estate


