HomeHealthచిన్నారుల్లో ఫ్యాటీ లివర్ అలర్ట్.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన లక్షణాలు ఇవే..!

చిన్నారుల్లో ఫ్యాటీ లివర్ అలర్ట్.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన లక్షణాలు ఇవే..!

Published on

spot_img

చిన్నారుల్లో ఫ్యాటీ లివర్ అలర్ట్:

ఇటీవల చిన్నారుల్లో ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతుండడం వైద్యులను ఆందోళనకు గురిచేస్తుంది. ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే ఎక్కువగా కనిపించిన ఈ వ్యాధి ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా నమోదు అవుతుంది. అధికంగా జంక్ ఫుడ్ తీసుకోవడం మొబైల్ ఫోన్లు, టీవీల ముందు ఎక్కువ సమయం గడపడం శారీరక వ్యాయామం లేకపోవడం.. ఊబకాయం పెరగడం వంటి కారణాలు దీనికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.

కారణం లేకుండానే అలసట :

పిల్లలు ఎలాంటి శ్రమ చేయకపోయినా తరచూ అలసటగా కనిపించడం ఫ్యాటీ లివర్ కి తొలి సంకేతంగా భావిస్తున్నారు. ఎప్పుడు నీరసంగా ఉండడం, చిన్న పనికి అలసిపోవడం, చురుకుదనం తగ్గిపోవడం వంటి లక్షణాలను తల్లిదండ్రులు గమనించాలి. ఇవి కాలేయ పనితీరు ప్రభావితమవుతున్న సూచనలుగా ఉండొచ్చు.

చర్మంలో మార్పులు:

మెడ చుట్టూ నల్లటి మచ్చలు కనిపించడం. చర్మం కాంతి కోల్పోవడం లేదా అనారోగ్యంగా కనిపించడం కూడా ఫ్యాటీ లివర్ కి సంకేతాలుగా వైద్యులు చెబుతున్నారు. ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ తో పాటు కాలేయ సమస్యలను సూచించే అవకాశం ఉంది.

జీర్ణ సమస్యలు పెరిగితే అప్రమత్తం:

తరచూ కడుపు ఉబ్బరం, కుడి వైపు పై భాగంలో నొప్పి లేదా అసౌకర్యం కనిపించడం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, చెక్కర పానీయాలు ఎక్కువగా తీసుకునే పిల్లల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

జీవనశైలిలో మార్పులు తప్పనిసరి:

అధిక బరువు ఉన్న పిల్లల్లో ఫ్యాటీ లివర్ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రారంభ దశలోనే గుర్తిస్తే జీవన శైలిలో మార్పులతో నియంత్రించవచ్చు. పిల్లలను బయట ఆటలకు ప్రోత్సహించడం. పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఇవ్వడం . జంక్ ఫుడ్ తగ్గించడం అవసరం. నిరంతరం అలసట, ఆకస్మిక బరువు పెరుగుదల లేదా రక్త పరీక్షల్లో మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

అరుదైన వ్యాధిని జయించి పేదలకు వైద్యం.. 32 ఏళ్లకే అనంతలోకాలకు యువ న్యూరాలజిస్ట్!

32 ఏళ్లకే ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ కుంకాల లావణ్య అకాల మరణం నెల్లూరులో విషాదాన్ని నింపింది. అరుదైన వ్యాధిని ధైర్యంగా ఎదుర్కొని తిరిగి వైద్య సేవల్లోకి వచ్చిన ఆమె.. పేదలకు అందుబాటు ధరల్లో వైద్యం అందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సేవలు, స్ఫూర్తిదాయకమైన జీవన ప్రస్థానం ఎందరికో ఆదర్శం.

గుండె ఆరోగ్యంగా ఉందా..? లేదా..? సింపుల్‌గా తెలుసుకునే 5 టిప్స్ ఇవే..!

గుండె ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి కొన్ని సింపుల్‌ లక్షణాలు, రోజువారీ అలవాట్లను గమనించవచ్చు. ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె చప్పుడు వంటి సంకేతాలతో పాటు ఈ 5 టిప్స్‌ గురించి తెలుసుకోండి.

బరువు తగ్గడానికి పండ్ల రసాలు తాగుతున్నారా? ఫ్యాటీ లివర్ ముప్పు జాగ్రత్త!

బరువు తగ్గాలని భోజనం మానేసి పండ్ల రసాలు, జ్యూస్‌లు మాత్రమే తాగడం ఆరోగ్యానికి మేలు చేయకపోవచ్చు. పండ్లలోని పీచు తగ్గిపోవడం, చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సహా పలు ఆరోగ్య సమస్యల ముప్పు పెరగవచ్చు.