HomeHealthఆరోగ్యానికి వరం అయిన మామిడి.. ఇలా తింటే శాపం! నిపుణుల హెచ్చరిక!

ఆరోగ్యానికి వరం అయిన మామిడి.. ఇలా తింటే శాపం! నిపుణుల హెచ్చరిక!

Published on

spot_img

ఆరోగ్యానికి వరం అయిన మామిడి.. ఇలా తింటే శాపం! నిపుణుల హెచ్చరిక :

వేసవికాలంలో ఎక్కువ మంది ఇష్టంగా తినే పండ్లలో మామిడి మొదటి స్థానంలో ఉంటుంది. రుచితో పాటు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఆంటీ ఆక్సిడెంట్లను అందించే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మామిడిని తినే విధానంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ప్రయోజనాల కంటే ఇబ్బందుల ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మామిడి పండ్లను ఉదయం అల్పాహారం సమయంలో లేదా భోజనాల మధ్య స్నాక్ గా (లంచ్‌కు ముందు లేదా తర్వాత 2 గంటల గ్యాప్) తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. ఈ సమయంలో తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభించడంతోపాటు పోషకాలు కూడా సులభంగా అందుతాయి.

అయితే భోజనం చేసిన వెంటనే మామిడిని డెసర్ట్ గా తినడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల శరీరంలో క్యాలరీలు, చక్కర స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి నిద్రకు ముందు మామిడి తినడం వల్ల అజీర్ణం ,గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు. మార్కెట్ నుంచి తెచ్చిన మామిడి పండ్లను నేరుగా తినకుండా..కొంతసేపు చల్లటి నీటిలో నానబెట్టి.. బాగా శుభ్రం చేసుకొని ఆ తర్వాత తినడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

మామిడి పండ్లలో ఫైటిక్ యాసిడ్ (Phytic Acid) అనే సహజ రసాయనం ఉంటుంది, ఇది శరీరంలో వేడిని కలిగిస్తుంది. నీటిలో నానబెట్టడం వల్ల ఆ వేడి తగ్గిపోతుంది. తద్వారా ముఖంపై మొటిమలు, వేడి గడ్డలు, మలబద్ధకం వంటి సమస్యలు రావు. పరిమిత మోతాదులో సరైన సమయంలో మామిడి తింటే ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇష్టం అని మామిడికాయలను ఎక్కువగా తినడం వల్ల బాగా వేడి అవుతుంది అని.. చిన్న పిల్లలకి మామిడికాయలు ఎక్కువ పెట్టడం వల్ల విరోచనాలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Latest articles

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు కీలక సూచనలు వెలువడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో భారీగా వేడుకలు నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు

అర్హత లేని టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అర్హతలు లేని టీచర్ల నియామకాలు, కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.
spot_img

Related Articles

రోజూ ఈ ఫుడ్స్ తింటే..1000 ఏనుగుల బలం మీ సొంతం..!

శరీరానికి రోజంతా కావాల్సిన శక్తి, పోషకాలు అందాలంటే రోజువారీ ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన ఫుడ్స్‌ను చేర్చుకోవాలి. ప్రొటీన్, ఐరన్, కాల్షియం, ఒమేగా-3 వంటి పోషకాలు అందించే ఆహారాలు తీసుకుంటే ఎనర్జీ లెవల్స్ మెరుగుపడటంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.

పిల్లలకు క్యాన్సర్ రాకుండా చేయగలమా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!

పిల్లల్లో క్యాన్సర్‌కు దారితీసే ప్రతి కారణాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాదు. అయితే చిన్నప్పటి నుంచే పోషకాహారం, శారీరక చురుకుదనం, ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి మంచి అలవాట్లను పాటించడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్‌తో పాటు పలు ఆరోగ్య సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చు.

తినేటప్పుడు చెమటలు పట్టడం దేనికి సంకేతం? అసలు కారణం ఇదే!

అన్నం లేదా వేడి ఆహారం తినేటప్పుడు ముఖం, నుదురు, మెడపై చెమటలు పట్టడం చాలామందిలో కనిపిస్తుంది. దీనికి శరీర ఉష్ణోగ్రత పెరగడం, మసాలా పదార్థాలు, ఆహారం తీసుకునే సమయంలో నాడీ వ్యవస్థ స్పందించడం వంటి కారణాలు ఉండొచ్చు.