HomeHealthభానుడి భగభగలు..వడదెబ్బకు చెక్ పెట్టే ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే..!

భానుడి భగభగలు..వడదెబ్బకు చెక్ పెట్టే ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే..!

Published on

spot_img

తెలుగు రాష్ట్రాలలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. వడగాలులు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ఎండ తీవ్రతను తట్టుకోలేక జనాలు ఇబ్బంది పడిపోతున్నారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ డాక్టర్లు సలహా ఇస్తున్నారు. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలల్లో 46 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు అవసరం ఉంటే తప్పిస్తే బయటికి రానే రావద్దు అంటూ డాక్టర్ లు సలహా ఇస్తున్నారు. మరి ముఖ్యంగా 12 గంటల నుండి నాలుగు గంటల మధ్య బయటకు అసలు రానే రావద్దు అంటూ హెచ్చరిస్తున్నారు.

వడ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ద్రవ పదార్థాలు : రోజు ఎక్కువగా నీరు, నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవాలి. ఇది శరీరాన్ని చల్లగా ఉంచి లవణాల సమతుల్యతను కాపాడుతుంది.

దుస్తులు: కాటన్, వదులుగా ఉండే లేత రంగు దుస్తులనే ధరించాలి. ముదురు రంగు బట్టలు వేడిని ఎక్కువగా పీల్చుకుంటుంది.

ఆహారం: మసాలాలు, కారం, నూనె ఎక్కువగా వేసి వేయించిన ఆహారాలకు బదులు తేలికగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పుచ్చకాయ, దోసకాయ, ఆరెంజ్ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం ఇంకా మంచిది.

వడదెబ్బ లక్షణాలు & చికిత్స :

*ఒకవేళ ఎవరైనా వడదెబ్బకు గురైతే వారిని వెంటనే చల్లటి ప్రదేశానికి మార్చి తడిగుడ్డతో శరీరాన్ని పూర్తిగా తుడవాలి. అంతే కాదు వాళ్ళకి నీళ్లు, కొబ్బరి నీళ్లు ఇలాంటి ద్రవపదార్థాలను ఇవ్వాలి. పరిస్థితి విషమిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

Latest articles

ఐఫోన్‌లో కొత్త శకం.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

యాపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కొత్త డిజైన్, ఫోల్డింగ్ డిస్‌ప్లే, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఐఫోన్‌పై టెక్ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.
spot_img

Related Articles

సడెన్ గా కళ్లు తిరుగుతున్నాయా..? మాట తడబడుతుందా..? వెరీ డేంజర్..!

సడెన్‌గా కళ్లు తిరగడం, మాట తడబడటం, చేతులు లేదా కాళ్లలో బలహీనత వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. ఇవి కొన్నిసార్లు స్ట్రోక్‌కు హెచ్చరిక సంకేతాలు కావచ్చు. ఇలాంటి లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.

రోజూ ఈ ఫుడ్స్ తింటే..1000 ఏనుగుల బలం మీ సొంతం..!

శరీరానికి రోజంతా కావాల్సిన శక్తి, పోషకాలు అందాలంటే రోజువారీ ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన ఫుడ్స్‌ను చేర్చుకోవాలి. ప్రొటీన్, ఐరన్, కాల్షియం, ఒమేగా-3 వంటి పోషకాలు అందించే ఆహారాలు తీసుకుంటే ఎనర్జీ లెవల్స్ మెరుగుపడటంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.

పిల్లలకు క్యాన్సర్ రాకుండా చేయగలమా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!

పిల్లల్లో క్యాన్సర్‌కు దారితీసే ప్రతి కారణాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాదు. అయితే చిన్నప్పటి నుంచే పోషకాహారం, శారీరక చురుకుదనం, ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి మంచి అలవాట్లను పాటించడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్‌తో పాటు పలు ఆరోగ్య సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చు.