HomeWarangal Newsహనుమకొండలో కేయూ భూముల భారీ కుంభకోణం.. 53 ఎకరాలు గల్లంతు!

హనుమకొండలో కేయూ భూముల భారీ కుంభకోణం.. 53 ఎకరాలు గల్లంతు!

Published on

spot_img

కేయూలో ఎంత భూమి మిస్సింగ్ అయింది?

కాకతీయ యూనివర్సిటీకి అధికారికంగా 673.12 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 547 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు సంయుక్త సర్వేలో తేలింది. అంటే దాదాపు 53 ఎకరాల భూమి గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు.

Kakatiya University భూముల వ్యవహారంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

యూనివర్సిటీకి చెందిన దాదాపు 53 ఎకరాల భూమి గల్లంతైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

వర్సిటీ స్థాపన సమయంలో 673.12 ఎకరాలుగా గుర్తించిన భూముల్లో ప్రస్తుతం 619.2 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు జాయింట్ ఫిజికల్ సర్వేలో తేలింది.

దాదాపు ఏడాదిన్నర క్రితం విజిలెన్స్, రెవెన్యూ, కేయూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడింది.

1976లో కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటు కోసం హనుమకొండ మండలంలోని కుమారపల్లి, లష్కర్ సింగారం, పలివెల్పుల గ్రామ పరిధిలో మొత్తం 673.12 ఎకరాల భూసేకరణకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

అయితే అప్పట్లో అధికారులు భూహద్దులను స్పష్టంగా నిర్ణయించి కాంపౌండ్ వాల్ నిర్మించకపోవడం వల్ల సమస్యలు మొదలయ్యాయి.

తర్వాతి కాలంలో యూనివర్సిటీ భూముల్లో వివిధ ప్రభుత్వ అవసరాల కోసం భూములు కేటాయించారు.

ఎస్‌ఆర్‌ఎస్‌పీ కెనాల్ కోసం 45.1 ఎకరాలు, రుద్రమదేవి ఫిల్టర్ బెడ్ కోసం 13.14 ఎకరాలు, సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ క్వార్టర్స్‌కు 10 ఎకరాలు… బాలమిత్ర పోలీస్ స్టేషన్‌కు 2 ఎకరాలు, ఆల్ ఇండియా రేడియో స్టేషన్‌కు 2 ఎకరాలు, ఎలక్ట్రిసిటీ సబ్‌స్టేషన్‌కు 1 ఎకరం, మున్సిపల్ పైప్‌లైన్ కోసం 2 ఎకరాలు ఇలా మొత్తం 72.5 ఎకరాలు కేటాయించినట్లు రికార్డులు చెబుతున్నాయి.

ఈ లెక్కన యూనివర్సిటీ వద్ద దాదాపు 600 ఎకరాలకు పైగా భూమి ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 547 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు సర్వేలో తేలింది.

అంటే దాదాపు 53 ఎకరాల భూమి మిస్సింగ్ అయినట్టే. ఈ భూమి విలువ ప్రస్తుతం రూ.800 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రైవేట్ వ్యక్తులు, పాత పట్టాదారులు యూనివర్సిటీ భూములను ఆక్రమించి విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇందులో పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు ఇండ్లు నిర్మించుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

ఈ వ్యవహారంపై అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టడంతో ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది.

2024 సెప్టెంబర్‌లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా ఫిజికల్ సర్వే నిర్వహించారు.

సర్వే పూర్తై నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు పూర్తి నివేదికను అధికారికంగా విడుదల చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆక్రమణలు జరిగిన ప్రాంతాల్లో 76 ఇండ్ల యజమానులకు భూ పత్రాలు సమర్పించాలని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇక రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ క్యాంపస్ చుట్టూ సుమారు 7 కిలోమీటర్ల మేర కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేసింది.

2024 మార్చి 10న శంకుస్థాపన కూడా నిర్వహించారు. అయితే భూహద్దుల స్పష్టత లేకపోవడంతో పనులు ఇంకా ప్రారంభం కాలేదు.

ఇప్పటికైనా భూ సర్వే నివేదికను ప్రజలకు వెల్లడ చేసి, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు..

యూనివర్సిటీ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఉద్యోగ, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

FAQ’s

1. కాకతీయ యూనివర్సిటీకి మొత్తం ఎంత భూమి ఉంది?

ప్రారంభ రికార్డుల ప్రకారం 673.12 ఎకరాల భూమి ఉంది.

2. ప్రస్తుతం ఎంత భూమి మాత్రమే ఉంది?

సర్వే ప్రకారం ప్రస్తుతం 547 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.

3. గల్లంతైన భూమి విలువ ఎంత?

ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.800 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

4. ఎవరు సర్వే నిర్వహించారు?

విజిలెన్స్, రెవెన్యూ, మున్సిపల్, యూనివర్సిటీ అధికారులు కలిసి సర్వే నిర్వహించారు.

5. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది?

కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేసింది. విజిలెన్స్ ఎంక్వైరీ కూడా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:
కాకతీయ యూనివర్సిటీ: వరంగల్ గర్వకారణం, 50 ఏళ్ల విజయ యాత్ర
కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ: 50 ఏళ్ల గొప్ప ప్రయాణం
కాకతీయ యూనివర్సిటీ ఫార్మా ఫ్యాకల్టీకి గ్లోబల్ ప్రశంసలు

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు కీలక సూచనలు వెలువడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో భారీగా వేడుకలు నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు

అర్హత లేని టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అర్హతలు లేని టీచర్ల నియామకాలు, కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.
spot_img

Related Articles

అసెంబ్లీ ముట్టడికి యత్నం: వరంగల్‌లో 11 మంది ఆశా వర్కర్ల ముందస్తు అరెస్ట్

జీతాల పెంపు, పెరిగిన పని ఒత్తిడిని తగ్గించాలనే ప్రధాన డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి పిలుపు వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన కార్యక్రమానికి బయలుదేరుతున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

హనుమకొండలో తీవ్ర కలకలం: మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో వ్యక్తి మృతదేహం లభ్యం

హనుమకొండ నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో మంగళవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. స్థానిక మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసులకు ప్రజా బాంధవ్య శిక్షణ

పండుగలు, జాతరలు, ఊరేగింపుల వంటి సందర్భాల్లో భారీగా కూడే జనసమూహాల పట్ల పోలీసులు మెలగాల్సిన తీరుపై భద్రాద్రి జోనల్ పరిధిలోని శిక్షకులకు (ట్రైనర్లకు) ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.