HomeHealthధర్మసాగర్ లో మెగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఎంపీ డా. కడియం కావ్య

ధర్మసాగర్ లో మెగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఎంపీ డా. కడియం కావ్య

Published on

spot_img

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు ప్రారంభించారు. కూరపాటి ఫౌండేషన్ ట్రస్ట్ సహకారంతో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ శిబిరం నిర్వహించారు.

Dr Kadiyam Kavya

ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య గారు మరోసారి తన వైద్య వృత్తిని స్మరింపజేస్తూ, శిబిరానికి వచ్చిన ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. వారికి స్వయంగా బీపీ పరీక్షలు చేసి, వైద్య రిపోర్టులను పరిశీలించి, అవసరమైన మందులను అందజేశారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులను ఆత్మీయంగా అడిగి తెలుసుకుంటూ సేవాభావంతో వ్యవహరించడం అక్కడి ప్రజలను ఆకట్టుకుంది.

“వైద్యం వ్యాపారం కాదు, మానవ సేవ”

ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ డా. కడియం కావ్య గారు వైద్యం అనేది వ్యాపారం కాకుండా మానవతా దృక్పథంతో చూడాల్సిన రంగమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.

Ekashila Hospitals

కూరపాటి ఫౌండేషన్ ట్రస్ట్ సేవలను ఆమె ప్రత్యేకంగా అభినందిస్తూ, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ప్రతి మండలంలో వైద్య శిబిరాలు అవసరం

Dr Kadiyam Kavya in Health Camp

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు అధికంగా ఉన్నందున మండలాల వారీగా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను తరచుగా నిర్వహించాలని సూచించారు. ప్రజలకు దగ్గర్లోనే వైద్య సేవలు అందించడం చాలా ముఖ్యమని తెలిపారు.

తక్కువ వయసులోనే ఆరోగ్య సమస్యలు

ప్రస్తుతం 30-40 ఏళ్ల వయసులోనే హార్ట్ ఎటాక్‌లతో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని ఎంపీ పేర్కొన్నారు. ఒకప్పుడు 50 ఏళ్ల తర్వాత కనిపించే అనారోగ్య సమస్యలు ఇప్పుడు తక్కువ వయసులోనే వస్తున్నాయని తెలిపారు.

Medical Camp

👉 అందుకే ప్రతి ఒక్కరూ:

ప్రతి ఏడాది ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి

సరైన ఆహారం తీసుకోవాలి

ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి

అని సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా, ఉప సర్పంచ్ కొమురమ్మ, సాయిపేట సర్పంచ్ లక్ష్మి, మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్, కూరపాటి ట్రస్ట్ చైర్మన్ కూరపాటి రమేష్, డాక్టర్ సుస్మిత, ఇతర వైద్యులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

అరుదైన వ్యాధిని జయించి పేదలకు వైద్యం.. 32 ఏళ్లకే అనంతలోకాలకు యువ న్యూరాలజిస్ట్!

32 ఏళ్లకే ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ కుంకాల లావణ్య అకాల మరణం నెల్లూరులో విషాదాన్ని నింపింది. అరుదైన వ్యాధిని ధైర్యంగా ఎదుర్కొని తిరిగి వైద్య సేవల్లోకి వచ్చిన ఆమె.. పేదలకు అందుబాటు ధరల్లో వైద్యం అందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సేవలు, స్ఫూర్తిదాయకమైన జీవన ప్రస్థానం ఎందరికో ఆదర్శం.

గుండె ఆరోగ్యంగా ఉందా..? లేదా..? సింపుల్‌గా తెలుసుకునే 5 టిప్స్ ఇవే..!

గుండె ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి కొన్ని సింపుల్‌ లక్షణాలు, రోజువారీ అలవాట్లను గమనించవచ్చు. ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె చప్పుడు వంటి సంకేతాలతో పాటు ఈ 5 టిప్స్‌ గురించి తెలుసుకోండి.

బరువు తగ్గడానికి పండ్ల రసాలు తాగుతున్నారా? ఫ్యాటీ లివర్ ముప్పు జాగ్రత్త!

బరువు తగ్గాలని భోజనం మానేసి పండ్ల రసాలు, జ్యూస్‌లు మాత్రమే తాగడం ఆరోగ్యానికి మేలు చేయకపోవచ్చు. పండ్లలోని పీచు తగ్గిపోవడం, చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సహా పలు ఆరోగ్య సమస్యల ముప్పు పెరగవచ్చు.