HomeEntertainmentటాలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం..తొలి రోజే "పెద్ది" ఆల్‌టైమ్ రికార్డు!

టాలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం..తొలి రోజే “పెద్ది” ఆల్‌టైమ్ రికార్డు!

Published on

spot_img

టాలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం..తొలి రోజే ఆల్‌టైమ్ రికార్డు :

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “పెద్ది” సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. భారీ అంచనాలను మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు వసూళ్లతో టాలీవుడ్ లో కొత్త రికార్డును సృష్టిస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల విడుదలైన “గేమ్ చేంజెర్” ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా “పెద్ది”తో రామ్ చరణ్ ఘనంగా కంబ్యాక్ ఇచ్చారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా విడుదలకు ముందే ట్రైలర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించగా విడుదలైన తర్వాత ఆ అంచనాలను మించి స్పందన లభించింది.

చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించిన వివరాల ప్రకారం పెద్ది తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా 135.36 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. ఈ కలెక్షన్లతో 2026 సంవత్సరంలో టాలీవుడ్ నుంచి వచ్చిన చిత్రాలలో అత్యధిక ఓపెనింగ్ నమోదు చేసిన సినిమాగా “పెద్ది” నిలిచింది. అంతేకాకుండా తొలి రోజు వసూళ్లపరంగా పలు రికార్డులను బద్దలు కొడుతూ కొత్త బెంచ్ మార్కును సెట్ చేసింది.

ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్, కుటుంబ ప్రేక్షకుల ఆదరణ, అభిమానుల ఉత్సాహం నేపథ్యంలో రెండో రోజు కూడా సినిమా బుకింగ్స్ బలంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ చిత్రానికి విశేష స్పందన లభిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రాంచరణ్ నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భావోద్వేగాలు యాక్షన్ సంగీతం కలగలిపిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు కీలక సూచనలు వెలువడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో భారీగా వేడుకలు నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు

అర్హత లేని టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అర్హతలు లేని టీచర్ల నియామకాలు, కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.
spot_img

Related Articles

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

హీరో జయం రవితో కెనీషా అలా..పరసనల్ వీడియో లీక్..!

హీరో జయం రవి, కెనీషాకు సంబంధించినదిగా ప్రచారం జరుగుతున్న ఓ పర్సనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది.

వార్నీ..మోక్షజ్ఞ డెబ్యూ ఛాన్స్ వశిష్టకి బాలయ్య ఇచ్చింది ఇందుకా..?

మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వశిష్ట దర్శకత్వంలో మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే అవకాశం ఉందనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు బాలయ్య ఈ ఛాన్స్ వశిష్టకే ఇవ్వడం వెనుక కారణమేంటన్నది ఆసక్తిని పెంచుతోంది.